Andhra Pradesh: అత్యాధునిక స‌దుపాయాల‌తో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఎన్‌సీ) మార్గదర్శకాలకు అను గుణంగా తీర్చిదిద్దారు. కళాశాల భవనాన్ని సుందరంగా రూపుదిద్దుతూ ఆహ్లాదకరంగా, కార్పొరేట్‌ హంగులతో ఫినిషింగ్‌ ఇస్తున్నారు.
Reconstruction of government medical college in eluru with the top facilities

సాక్షి: ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలకు తుది రూపం ఏర్పడింది. అత్యాధునిక సౌకర్యాలు, ల్యాబ్‌లు, సెంట్రల్‌ ఏసీ, కార్పొరేట్‌ హంగులతో భవనాలు వైద్య విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. క‌ళాశాల‌లో నిర్మించిన స‌రికొత్త స‌దుపాయాలు ఇవే...
 
● 150 మంది వైద్య విద్యార్థులకు సరిపోయేలా 2 లెక్చర్‌ హాల్స్‌.
● కార్పొరేట్‌ లుక్‌తో జీ ప్లస్‌ టూ అంతస్తుల భవనం.
● సౌండ్‌ఫ్రూఫ్‌ విత్‌ డిజిటల్‌ పోడియంతో లెక్చర్‌ హాల్స్‌.
● విద్యార్థులకు 7 ప్రత్యేక టీచింగ్‌ గదులు.
● అత్యాధునిక అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్స్‌.
● మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్స్‌–2.
● సెంట్రల్‌ లైబ్రరీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌.
● హెచ్‌ఓడీలకు అధునిక సౌకర్యాలతో చాంబర్లు.
● ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ప్రత్యేక రూమ్స్‌.
● ప్రతి అంతస్తులో విద్యార్థులు, స్టాఫ్‌కు వేర్వేరుగా టాయిలెట్స్‌.
● రెండు వైపులా మెట్లతోపాటు లిఫ్ట్‌ సౌకర్యం.
● మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ చాంబర్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ నిర్మిస్తున్నారు.

    JNTUK: అగ్రస్థానంలో జేఎన్‌టీయూకే

ఏలూరు నగరానికి తలమానికంగా మూడు అంతస్తుల మెడికల్‌ కాలేజీ భవనం తళుక్కుమంటోంది. ఇక్కడ వారం రోజుల్లో ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఏళ్ల నాటి హేలాపురివాసుల కల నెరవేరనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తుండగా.. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ప్రత్యేక శ్రద్ధతో కళాశాల పనులు చేయించారు. ఏకంగా రూ.525 కోట్ల వ్యయంతో వైద్యకళాశాల, సర్వజన ఆస్పత్రి, విద్యార్థులకు హాస్టళ్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి క్వార్టర్స్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

రూ.60 కోట్లతో వైద్య కళాశాల

ఏలూరు పాతబస్టాండ్‌ సమీపంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టారు. లక్ష చదరపు అడుగుల్లో జీ ప్లస్‌ టూ భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.60 కోట్ల నిధులతో భవన నిర్మాణం చేపట్టగా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రా అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) పర్యవేక్షణలో మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ యుద్ధప్రాతిపదికన కళాశాల భవన నిర్మాణాన్ని చేపట్టింది. పనులు చేపట్టిన రెండేళ్లలో విద్యార్థులకు మొదటి ఏడాది తరగతులు నిర్వహించేలా భవనాన్ని సిద్ధం చేసింది.

రూ.525 కోట్ల భారీ వ్యయంతో..

పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తామనే హామీని నిలబెట్టుకుంటూ సీఎం జగన్‌ 2019లో ఏలూరు జీజీహెచ్‌లో కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో రూ.525 కోట్లతో నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. జీజీహెచ్‌ ప్రాంగణంలో ఆధునిక వసతులతో కార్పొరేట్‌ స్థాయిలో 2 లక్షల చదరపు అడుగుల్లో జీప్లస్‌–4 భారీ ఆస్పత్రి, 2.5 లక్షల చదరపు అడుగుల్లో వైద్య కళాశాల శాశ్వత భవనం, వైద్య విద్యార్థులకు రెండు హాస్టల్‌ భవనాలు, ప్రొఫెసర్లు, వైద్య సిబ్బంది నివాసానికి క్వార్టర్స్‌ నిర్మాణం చేసేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఏంసీహెచ్‌ బ్లాక్‌ పై అంతస్తులో హాస్టల్‌, డైనింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రానున్న మూడేళ్లలో పూర్తిస్థాయిలో మెడికల్‌ కళాశాల ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.

Engineering Web options: ముగిసిన ఇంజినీరింగ్‌ ఆప్షన్ల గడువు

ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకు..

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు వచ్చేనెల 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో 150 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతులు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటుచేశారు. సౌకర్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కళాశాలలో చేరేలా ప్రోత్సహిస్తున్నాం. డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ చేపట్టి విద్యార్థులను కేటాయిస్తుంది.
    – డాక్టర్‌ కేవీవీ విజయ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఏలూరు.

#Tags