Engineering Web options: ముగిసిన ఇంజినీరింగ్ ఆప్షన్ల గడువు
మురళీనగర్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ర్యాంకర్లు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదులో విద్యార్థులకు సహకరించారు. ఈ నెల 23న సీట్లు కేటాయిస్తారు. అదే రోజు నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టు చేయాలి. సీటు కేటాయింపు నిర్ధారణ లెటర్, సెల్ఫ్ రిపోర్టులను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీకి అందించాలని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ కేడీవీ నరసింహారావు సూచించారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు వెళ్లాలనుకునే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
చదవండి: ZP High School: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా