NEET UG Counselling 2024 : నీట్ యూజీ ప్ర‌వేశాల‌కు మూడు విడ‌త‌ల్లో కౌన్సెలింగ్‌.. ఈ పత్రాలు త‌ప్ప‌నిస‌రి..!

దేశ వ్యాప్తంగా వైద్య క‌ళాశాల‌ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా వైద్య క‌ళాశాల‌ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, నీట్‌ యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు విడుద‌ల కావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో వైద్య క‌ళాశాల‌ల్లో ప్రవేశాల ప్రక్రియను కూడా ప్రారంభించారు. 

ప్ర‌వేశాల‌కు నోటిఫికేషన్‌
ఎంబీబీఎస్, డెంటల్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డాక్టర్‌ ఎన్టీఆర్‌, కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీలు ప్రవేశాల నోటిఫికేషన్లను విడుదల చేశాయి.

RRB Recruitment : ఆర్ఆర్‌బీలో పారామెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.

కౌన్సెలింగ్, ఎంపిక ప్ర‌క్రియ‌..
దేశ‌వ్యప్తంగా తొలి కౌన్సెలింగ్‌కు ఆగ‌స్ట్ 14 నుంచి 21వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. అనంత‌రం, ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంపికైన వారు ఆగస్టు 24 నుంచి 29వ తేదీల్లో కాలేజీల్లో చేరాలి. రెండో విడ‌త‌ కౌన్సెలింగ్‌కు సెప్టెంబరు 5వ తేదీన ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అవుతాయి. అదే నెల‌ 13న ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్‌ 14 నుంచి 20లోపు విద్యార్థులు కాలేజీల్లో చేరాలి. మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 16 నుంచి 20 వరకు ఉండ‌గా అక్టోబరు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు సెప్టెంబర్‌ 24 నుంచి 30వ తేదీలోపు కాలేజీల్లో చేరాలి. ఇలా విద్యార్థులకు మొత్తం మూడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు.

Job Chart and Promotions : ఉద్యోగులకు జాబ్‌ చార్టు, ఉద్యోగోన్నతులపై ఆత్మీయ స‌మావేశం..

విద్యార్థులు నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో ప్ర‌వేశ పెట్టాల్సిన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు ఇవే..

➤నీట్‌ యూజీ 2024 ర్యాంక్‌ కార్డు, అడ్మిట్‌ కార్డు, డొమిసైల్ సర్టిఫికేట్ 
➤పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో
➤6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
➤ఇంటర్మీడియట్‌ స్టడీ, పాస్‌ సర్టిఫికెట్లు
➤మైగ్రేషన్ సర్టిఫికెట్‌
➤మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌
➤పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు

Teachers Transfer : బ‌దిలీల‌ను ఈ నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌..

➤ఇంటర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
➤కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
➤ఆధార్‌ కార్డు
➤ఇన్‌కాం సర్టిఫికెట్‌
➤దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ సర్టిఫికెట్‌

Education Development : విద్యారంగం అభివృద్ధికి ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి విరాళం.. భార‌త్‌లోనూ ఎన్నో అవ‌కాశాలు..

#Tags