RRB Recruitment : ఆర్ఆర్‌బీలో పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు అర్హులు..
ఆర్ఆర్‌బీ అంటే.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భారతీయ రైల్వేలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకటించిన ఉద్యోగాల వివరాల ఆధారంగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నిరుద్యోగులు, ఉద్యోగాన్ని పొందేందుకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఈ నోటిఫికేషన్‌లో వేల సంఖ్యలో పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు అర్హతలు, తదితర వివరాలు ఇలా..
పోస్టుల వివరాలు..
1. క్లినికల్ సైకాలజిస్ట్ - 07
2. సూపరింటెండెంట్ ఆఫ్ నర్సింగ్ - 713
3. ప్రయోగశాల సూపరింటెండెంట్ - 27
4. డైటీషియన్ - 05 పోస్టులు
5. ECG టెక్నీషియన్ - 13
Job Chart and Promotions : ఉద్యోగులకు జాబ్ చార్టు, ఉద్యోగోన్నతులపై ఆత్మీయ సమావేశం..
6. డయాలసిస్ టెక్నీషియన్ - 20
7. హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ - 126
8. ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ - 04
9. ఫార్మసిస్ట్ - 246
10. ఫిజియోథెరపిస్ట్ - 20
11. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 02
12. క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ - 02
13. పెర్కషనిస్ట్ - 02
14. లేబొరేటరీ అసిస్టెంట్ 94
15. స్పీచ్ థెరపిస్ట్ - 01
Teachers Transfer : బదిలీలను ఈ నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్..
16. కార్డియాక్ టెక్నీషియన్ - 04
17. ఆప్టోమెట్రిస్ట్ - 04
18. డెంటిస్ట్- 03
19. రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ - 64
20. ఫీల్డ్ వర్కర్ - 19
ఇలా మొత్తంగా 1,376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అర్హుత: సంబంధిత కోర్సుల పూర్తి చూసి ఉండాలి. పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి. ఆసుపత్రుల్లో 3 నెలల ఇంటర్న్‌షిప్ చేసుండాలి.
ఈ కోర్సులు పూర్తి చేయాలి: నర్సింగ్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, డైటీషియన్‌కు బీఎస్సీ అండ్ డైటెటిక్స్‌లో ఒక ఏడాది డిప్లొమా పూర్తి చేసుండాలి.
వయసు: నర్సింగ్ సూపరింటెండెంట్, పెర్కషనిస్ట్ పోస్టులకు గరిష్టంగా 43 ఏళ్లు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 20 నుంచి 38, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు 21 నుంచి 33, ఫీల్డ్ వర్కర్ ఉద్యోగానికి 18 నుంచి 33, ఇతర పోస్టులకు గరిష్టంగా 36 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ పోస్టుకు వయసు సడలింపులు ఉన్నాయి.
వేతనం: ఫీల్డ్ వర్కర్ పోస్టుకు కనీస వేతనం రూ.19,900 కాగా, నర్సింగ్ సూపర్ వైజర్ పోస్టుకు గరిష్ట వేతనం రూ.44,900 ఉంటుంది. కాని, మగితావాటికి మాత్రం పోస్టులు, అర్హతల అనుసారంగా ఉంటాయి.
Education System : ఇకపై 12వ తరగతిలో 9-11వ తరగతి మార్కులు కూడా...! కొత్త విధానం ఇలా..!
ఎంపిక, పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికేట్ పరిశీలన ఉంటుంది. ప్రధాన నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
తేదీ, సమయం: పరీక్షకు కొంత సమయం ముందు తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం, రుసుము: https://indianrailways.gov.in/వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష నోటిఫికేషన్‌ను క్షున్నంగా చదివిన తరువాత దరఖాస్తులు చేసుకోవచ్చు.
జనరల్ కేటగిరి రుసుము: 500
ఎస్సీ/ఎస్టీ కేటగిరి రుసుము: 400
పరీక్ష రాసిన తర్వాత జనరల్ కేటగిరికి రూ.400 ఇతర కేటగిరీకి రూ.400 వాపసు ఇస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 17-8-2024
Vande Bharat Train: 20 కోచ్‌ల వందేభారత్.. ట్రయల్ రన్ విజయవంతం
Tags
- RRB Recruitment 2024
- Job Applications
- online registrations
- Railway Recruitment Board
- job notifications 2024
- job recruitments
- medical jobs
- RRB Medical jobs
- paramedical jobs notification 2024
- online applications
- bsc eligibles
- eligibles for paramedical posts
- Education News
- Sakshi Education News
- Railway Recruitment Board
- RRB recruitment
- Indian Railways vacancies
- Paramedical Posts
- RRBNotification
- JobEligibility
- JobApplication
- GovernmentJobs
- RRBVacancies
- UnemployedOpportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications