Skip to main content

Teachers Transfer : బ‌దిలీల‌ను ఈ నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌..

ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీ­లకు రంగం సిద్ధమైంది.
Teachers demand on transfer methods with a particular ratio  Government school teacher transfer process in Amaravati

అమరావతి: ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీ­లకు రంగం సిద్ధమైంది. ఈ ప్ర­క్రియ ఆదివారం నాటికి పూర్తి కావాల్సి ఉండగా టీ­చర్, విద్యార్థుల నిష్పత్తి, సర్వీ­స్, స్టేషన్‌ అంశాల్లో ఏది ప్రామాణికంగా తీసుకోవాలన్న అంశంపై తర్జ­నభర్జనతో బదిలీలను సోమవారానికి వాయిదా వేశా­రు. పైకి మాత్రం పని సర్దుబాటు ఆధారంగా బది­లీలు అని చెబుతున్నా అంతర్గతంగా కూటమి నేతల­కు కాసులు కురిపించే ప్రక్రియగా మారిందనే ఆరో­పణలు వ్యక్తమవుతున్నాయి. తమ సిఫారసు లేఖల­తో వచ్చిన వారికి బదిలీలలో ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రులు, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Education Development : విద్యారంగం అభివృద్ధికి ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి విరాళం.. భార‌త్‌లోనూ ఎన్నో అవ‌కాశాలు..

ఇదే అదనుగా గ్రామీణ ప్రాంతాల్లో పని­చేస్తున్న ఉపాధ్యాయులు సిఫారసు లేఖలతో మండలం, జిల్లా కేంద్రాలకు లేదంటే సమీపంలోని పాఠ­శాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ప్రక్రియ జిల్లా స్థాయిలో జరుగుతుండటంతో భారీగా అక్రమాలకు ఆస్కారముందని పలు ఉ­పా­­ధ్యా­య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్లు, సె­కండరీ గ్రేడ్‌ టీచర్లు మొత్తం 29,992 మంది ఉ­పాధ్యాయులు మిగులు కనిపిస్తుండగా ఈ ఏడాది ఇ­ప్పటివరకు ఉద్యోగ విరమణ చేసిన వారు 2 వేల మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 30 మంది విద్యా­ర్థులకు ఓ టీచర్‌ ఉండాలని విద్యాశాఖ నిబంధన తేవడంతో గరిష్టంగా 4 వేల నుంచి 5 వేల మందికి బదిలీకి అవకాశముంది. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న వారిని బదిలీల నుంచి మినహాయించారు. 

Education System : ఇక‌పై 12వ తరగతిలో 9-11వ తరగతి మార్కులు కూడా...! కొత్త విధానం ఇలా..!

బదిలీలు 1: 20 ప్రకారం చేయాలని డిమాండ్‌ 
ఇటీవల ఉపాధ్యా­యుల అటెండెన్స్‌ యాప్‌­లో సిబ్బంది సర్వీ­సు వివ­రాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్‌ జోడించారు. దీని ద్వారా ఉపాధ్యా­యు­లంతా తమ సర్వీస్‌ రికార్డు వివరాలను న­మోదు చేశారు. ఈ లెక్కల ప్రకారం స్కూ­ల్‌ అసిస్టెంట్లు (సబ్జెక్టు టీచర్లు) 8,773 మంది, ఎస్‌జీటీలు 20,469 మంది మిగులు ఉన్నట్టు తే­ల్చారు. ఎయిడెడ్‌లో మరో 750 మంది కలిపి మొ­త్తం మిగులు ఉపాధ్యాయలు 29,992 మంది ఉన్నా­రు. సర్దుబాటు బదిలీల్లో భాగంగా 30 మంది విద్యా­ర్థులకు ఓ టీచర్‌ చొప్పున ఉండేలా ప్రభుత్వం ఉత్త­ర్వులిచ్చింది. ఈ లెక్కన సర్దు­బాటు చేస్తే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నష్టం జరుగు­తుంది.

Vande Bharat Train: 20 కోచ్‌ల వందేభారత్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

ప్రాథమిక పాఠ­శాలల్లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ నిష్పత్తి­లో, ఉన్నత పాఠశాలలకు 1:45 నిష్పత్తిలో లేదా జీవో53 ప్రకారం ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చే­స్తున్నారు. దీనివల్ల 6 నుంచి 7 వేల మందికి అవ­కాశం లభిస్తుందంటున్నా­దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. సర్దుబాటు బదిలీల్లో సమస్య­లను పరిష్క­రించుకునేందుకు టీ­డీపీ ఎమ్మె­ల్సీ­లతో చర్చించేందుకు రావాలని ఉపా­ధ్యాయ సంఘాలను ఆహ్వా­నించినప్పటికీ తామనుకున్న వి­ధంగా ప్రక్రియ ము­గించేందుకు ప్రభుత్వం సన్నా­హాలు చేస్తోంది. సర్దు­బాటు బది­లీలు తొలుత రాష్ట్ర స్థాయి­లో చేపట్టా­లని నిర్ణయించినా అనంతరం జి­ల్లా స్థా­యిలో మండల యూని­ట్‌గా నిర్వహించేలా ఏర్పా­ట్లు చేశారు. కూట­మి నేతలు దీన్ని ఆసరాగా చేసుకు­ని తమ సి­ఫా­రసు లేఖలు తెచ్చుకున్న వారిని కోరు­కు­న్నచో­టకు పంపించాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం.

Railway Projects: ఎనిమిది కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల్లో..

Published date : 12 Aug 2024 10:36AM

Photo Stories