Medical Students: నిరసనలో వైద్య విద్యార్థులు.. చివరికి ఇలా..!

విద్యార్థలు వారి సమస్యలను చెబితే వాటిని సమాధానంగా ప్రిన్సిపాల్‌ వేధింపులు దక్కాయి. ఈ నేపథ్యంలో నిరసనకు దిగిన విద్యార్థులకు హెచ్‌ఓడీల మాటలను, ప్రిన్సిపాల్‌ వేధింపుల గురించి ఆరోపించారు..

కొత్తగూడెంరూరల్‌: ‘మీ భవిష్యత్‌ మా చేతుల్లో ఉంది. మీరు ఎలా ఎంబీబీఎస్‌ పాస్‌ అవుతారో చూస్తాం. ప్రిన్సిపాల్‌ను, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రాక్టికల్‌, ఇంటర్నల్‌ మార్కులు, హాజరు శాతం అంతా మా చేతుల్లోనే. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారా? నిరసన విరమించకపోతే ముందుంది మొసళ్ల పండగ.’ అంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలోని కొందరు హెచ్‌ఓడీలు బెదిరించారని పలువురు మెడికోలు ఆరోపిస్తున్నారు.

Telugu University: తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం.. పురస్కార గ్రహీతలు వీరే...

కేఎస్‌ఎంలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రిన్సిపాల్‌ వేధింపులపై చర్యలు తీసుకోవాలని చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని హెచ్‌ఓడీలు అడ్డుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని మంగళ, బుధవారాల్లో మెడికోలు ఆందోళన చేపట్టగా, డీఎంఈ వాణి ఆదేశాల మేరకు ఖమ్మం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ బృందం, కలెక్టర్‌ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు జిల్లా అధికారుల బృందం వైద్య కళాశాలలో బుధవారం నుంచి విచారణ చేపడుతున్నాయి. కాగా ధర్నా చేస్తున్న విద్యార్థులను కళాశాల భవనంలోని ఓ గదికి పిలిచి హెచ్‌ఓడీలు హెచ్చరించినట్లు తెలిసింది.

School Holidays: మార్చి 25న‌ పాఠశాలలకు సెలవు.. కార‌ణం ఇదే..!

బెదిరింపుల వెనుక ప్రిన్సిపాల్‌ హస్తం?

రెండు రోజులపాటు వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో నిరసన విరమింపజేయాలని ప్రిన్సిపాల్‌ హెచ్‌ఓడీలపై ఒత్తిడి చేసినట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ప్రాక్టికల్‌, ఇంటర్నల్‌ మార్కులు, హాజరు, సెమిస్టర్‌ పరీక్షలు తదితర కారణాలు చూపి ఆందోళన విరమింపజేయాలని ప్రిన్సిపాల్‌ సూచించినట్లు సమాచారం. గురువారం ధర్నా చేస్తున్న విద్యార్థులను తరగతి గదుల్లోకి రావాలని వైస్‌ ప్రిన్సిపాల్‌ ఫోన్‌ ద్వారా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Telangana Vidyarthi Parishad: విద్యార్థులకు వసతులు కల్పించాలి

హెచ్‌వోడీలు, వైస్‌ ప్రిన్సిపాల్‌ బెదిరింపులతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా మెడికోలు తలవంచక తప్పలేదని సమాచారం. బెదిరింపుల ఆరోపణలపై కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిల్‌ను వివరణ కోరగా.. విచారణ జరుగుతోందని, నివేదిక కలెక్టర్‌కు అందిస్తారని చెప్పుకొచ్చారు. కాగా గురువారం వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిల్‌ విద్యార్థులతో మాట్లాడుతూ.. ఇక నుంచి ఏ సమస్య వచ్చినా తానే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి తరగతి గదులకు వెళ్లారు.

Change Maker Sia Godica: చేంజ్‌ మేకర్‌గా గుర్తింపు.. సైన్స్‌ వీడియోతో బహుమతి..

#Tags