Skip to main content

Govt Medical College: ప్రభుత్వ వైద్య కళాశాల స్థానచలనం.. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా..!

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కళాశాలను నగర శివారు రఘునాథపాలెం మండలానికి తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం భూమిని సైతం కేటాయించినందున త్వరలోనే పనులు మొదలుకానున్నాయి.
Medical College construction ongoing in old Collectorate

ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు స్థానచలనం కలగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో కళాశాల తరలింపునకు అధికారులు సిద్ధమవుతున్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కళాశాలను నగర శివారు రఘునాథపాలెం మండలానికి తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం భూమిని సైతం కేటాయించినందున త్వరలోనే పనులు మొదలుకానున్నాయి. జిల్లా కేంద్రం దినదినాభివృద్ధి చెందుతుండగా రద్దీ పెరుగుతోంది.

CMAT 2024 Notification: సీమ్యాట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..

ప్రస్తుతం మెడికల్‌ కళాశాల నగరం నడిబొడ్డున కొనసాగుతుండగా.. భవిష్యత్‌లో ఇబ్బంది ఎదురుకావొద్దనే భావనతో రఘునాథపాలెం, బల్లేపల్లి పంచాయతీల పరిధిలో 45 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. ఆ స్థలంలో విద్యార్థులకు బోధన, హాస్టళ్లకు సరిపడా భవనాలను నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేశారు.

UGC Aims To Train 5000 Employees: సెంట్రల్‌ యూనివర్సిటీలోని నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి యూజీసీ శిక్షణ

గత ఏడాది ప్రారంభం

ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని గత ఏడాది సెప్టెంబర్‌ 15న తెలంగాణ మాజి సీఎం కేసీఆర్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. తొలుత మెడికల్‌ కాలేజీని మంజూరు చేయగా రూ.166 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి అనుసంధానంగా కళాశాలకు స్ధలాన్ని కేటాయించారు. బోధన, ప్రాక్టికల్స్‌, హాస్టళ్ల భవనాల కోసం సుమారు 25 ఎకరాలు అవసరం ఉంటుందని అంచనా వేయగా ఆస్పత్రి ఎదుట ఉన్న పాత కలెక్టరేట్‌, ఆర్‌ అండ్‌ బీ భవనాలను సమకూర్చారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ 21.31 ఎకరాలు, కలెక్టరేట్‌ 5.23 ఎకరాలు, ఆర్‌ అండ్‌ బీ కార్యాలయ ఆవరణ 3.09 ఎకరాలతో పాటు మరో రెండెకరాలకు పైగా పాత డీఎంహెచ్‌ఓ స్థలం కలిపి 32ఎకరాల మేర కేటాయించగా... ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.9 కోట్లు విడుదల చేసింది.

IIITDM Admission 2024: ఐఐఐటీడీఎంలో ఎండీఈఎస్‌లో ప్రవేశాలు.. సీఈఈడీ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

దీంతో పాత కలెక్టరేట్‌, ఆర్‌అండ్‌బీ, పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను ఆధునికీకరించడమే కాక పాత కలెక్టరేట్‌ వెనుకాల అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, లెక్చరర్‌ హాళ్లు, స్టాఫ్‌ రూమ్స్‌ నిర్మించారు. అలాగే పాత కలెక్టరేట్‌ భవనంలో అడ్మిన్‌ బ్లాక్‌, ఆడిటోరియం, విద్యార్థులకు క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. ఇక పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని బాయ్స్‌ హాస్టల్‌కు, ఆర్‌అండ్‌బీ భవనాన్ని గర్ల్స్‌ హాస్టల్‌కు కేటాయించారు. కాగా గత ఏడాది ఆగస్టు నుండి నీట్‌ ద్వారా ర్యాంకులు సాధించిన 100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి తరగతులు బోధిస్తున్నారు.

Summer Holidays: ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..

ఆరు అంతస్తుల్లో భవనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్రం మధ్యలో ఉన్న మెడికల్‌ కళాశాలను తరలించాలని నిర్ణయించారు. అత్యాధునిక హంగులతో భవనాలు నిర్మించడంతో పాటు భవిష్యత్‌లో పారామెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌ కళాశాలలకు అనుమతి వచ్చినా సరిపోయేలా రఘునాథపాలెం, బల్లేపల్లి పంచాయతీల శివార్లలో సుమారు 45 ఎకరాలకు పైగా కేటాయించారు. రఘునాథపాలెం పంచాయతీ పరిధిలో 29.20 ఎకరాలు, బల్లేపల్లి పంచాయతీ పరిధిలో 16.26 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గతంలో కేటాయించిన నిధులతోనే ఇక్కడ నూతన భవనాలు నిర్మిస్తారు. ప్రస్తుతం ఆరు అంతస్తుల్లో భవనం నిర్మించి బోధనతో పాటు బాలికలు, బాలుర హాస్టళ్లు, ప్రిన్సిపాల్‌ క్వార్టర్లకే కేటాయిస్తారు.

Free Training: ఈ కోర్సుల్లో 30 రోజులపాటు ఉచిత శిక్షణ..

మరోపక్క ప్రస్తుత కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం అనుమతి కోసం ఆన్‌లైన్‌లో నివేదికలు సమర్పించిన అధికారులు.. విద్యార్థుల కోసం ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ విభాగాలను సిద్ధం చేస్తున్నారు. ఆపై విద్యార్థులు మూడో సంవత్సరానికి చేరేలోగా ఎంపిక చేసిన స్థలంలో భవనాల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. తొలిదశలో వారికి అవసరమైన ఈఎన్‌టీ, ఆఫ్తాల్మిక్‌, సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఎస్‌పీఎల్‌), ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాలను సిద్ధం చేస్తే తరగతులు ప్రారంబించే అవకాశముంటుంది. అనంతరం క్రమక్రమంగా నిర్మాణాలు చేపడుతూ పూర్తిస్ధాయిలో కళాశాలను తరలించాలనే యోచనలో ఉన్నారు.

Carrom Championship: క్యారమ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా..

ప్రస్తుతం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నాలుగో ఏడాదికి వచ్చేలోగా ఇబ్బంది ఏర్పడే అవకాశముంది. బోధన, హాస్టల్‌ వసతి కల్పించడం కష్టమవుతుంది. అందువల్ల భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 45 ఎకరాల స్థలాన్ని మెడికల్‌ కాలేజీకి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఉన్న కళాశాలలో ఎన్‌ఎంసీ నుండి అనుమతులు రాగానే ఈ ఏడాది అక్టోబర్‌లో రెండో ఏడాది బోధన మొదలవుతుంది. నూతనంగా కళాశాలలో తొలుత మూడో ఏడాది విద్యార్థులకు బోధన మొదలుపెట్టి.. ఆతర్వాత పూర్తస్థ్రాయిలో నిర్మాణాలు చేసి మొత్తం కళాశాలను తరలిస్తాం.

– డాక్టర్‌ ఎస్‌.రాజేశ్వరరావు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌

Published date : 05 Apr 2024 03:45PM

Photo Stories