Summer Holidays: ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..
Sakshi Education
పార్వతీపురం టౌన్: ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుతం వేసవి సెలవులు ప్రకటించిందని డీవీఈఓ మంజులా వీణ తెలిపారు.
ఈ మేరకు ఏప్రిల్ 4న ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 1 నుంచి తిరిగి ఇంటర్మీడియట్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!
సెలవుల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించరాదని, అలాగే షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Published date : 05 Apr 2024 03:45PM