National Scholarship: జాతీయ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థుల ఎంపిక
Sakshi Education
ఆసిఫాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన 24 మంది విద్యార్థులు జాతీయ ప్రతిభా స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.
ఎంపిౖకైన విద్యార్థులను జూలై 17న పాఠశాల ఆవరణలో అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల్లో 927 మార్కులకు పైగా సాధించిన 24 మంది మెరిట్ ఆధారంగా ఇంటర్ బోర్డు విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో చోటు సంపాదించారని తెలిపారు.
చదవండి: National Scholarships: దివ్యాంగులకు నేషనల్ స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
ఎంపీసీ గ్రూప్ నుంచి 13 మంది, బైపీసీ నుంచి 9, సీఈసీ, ఎంఈసీ నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారన్నారు. వీరికి డిగ్రీలో రూ.10 వేలు, పీజీలో రూ.20 వేల చొప్పున మొత్తం రూ.70వేల స్కాలర్‌షిప్ అందిస్తారని పేర్కొన్నారు.
Published date : 18 Jul 2024 03:39PM
Tags
- National Scholarship
- Telangana model schools
- Principal Abdul Khalil
- Intermediate
- Kumuram Bheem Asifabad District News
- Telangana News
- Telangana Model School students
- National Talent Scholarship
- Asifabad Rural education
- Principal Abdul Khalil
- Intermediate exam results
- Merit-based selection
- Inter Board preliminary list
- Academic excellence
- student achievement
- School congratulatory event
- sakshieducation latest news