National Scholarships: దివ్యాంగులకు నేషనల్ స్కాలర్‌షిప్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
Sakshi Education
కర్నూలు(అర్బన్): జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగులు) నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా కోరారు.
అర్హులైన విద్యార్థులు http://scholarships.gov.in లో ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదువుతున్న దివ్యాంగులు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్‌నకు ఆన్‌లైన్‌లో ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Published date : 13 Jul 2024 03:38PM