Intermediate Supplementary Exams: ఈ నెల 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు..
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు శనివారంతో ముగిశాయని డీఐఈఓ వనుము సోమశేఖరరావు ఓ ప్రకటనతో పేర్కొన్నారు. గత ఫిబ్రవరి నెలలో జరిగిన ఇంటర్మీడియెట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ శనివారంతో ముగిశాయన్నారు. అమలాపురం, కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించామన్నారు. జనరల్ కోర్సులకు సంబంధించి కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిపామన్నారు.
ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ అడ్వాన్స్ సప్లమెంటరీ థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ‘నైతికత–మానవ విలువలు’ పరీక్ష జూన్ 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 7న ‘పర్యావరణ విద్య’ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని డీఐఈఓ వివరించారు.
NEET Entrance Exam: ఎంబీబీఎస్ ప్రవేశాలకు నేడే నీట్ పరీక్ష.. ఈసారి విద్యార్థుల సంఖ్య..!