Skip to main content

Asian Yogasana Championship: యోగాసన ఛాంపియన్‌షిప్‌లో 83 స్వర్ణాలు సాధించిన‌ భారత్

యోగాకు పుట్టినిల్లుగా పేర్కొనే భారతదేశం ఆసియా యోగాసన ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
India Bag 83 Gold Medals at Asian Yogasana Sport Championship

ఏప్రిల్ 27వ తేదీ ముగిసిన ఈ పోటీల్లో ఏకంగా 83 స్వర్ణాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. 

83 బంగారు పతకాలతో పాటు 3 వెండి, 1 కాంస్య పతకం కూడా గెలుచుకుంది. మొత్తం 87 పతకాలతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జపాన్ 10 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో నేపాల్, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్‌తో క‌లిపి మొత్తం 21 దేశాలు పాల్గొన్నాయి. 

మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలివే..
భారతదేశం: 83 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం
జపాన్: 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు
మంగోలియా: 1 స్వర్ణం, 11 రజతాలు, 6 కాంస్యాలు
ఒమన్: 1 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు
నేపాల్: 0 స్వర్ణాలు, 27 రజతాలు, 12 కాంస్యాలు

Mirabai Chanu: ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్పర్సన్ మీరాబాయ్ చాను

Published date : 28 Apr 2025 12:44PM

Photo Stories