Free Education: కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
నిజామాబాద్‌అర్బన్: ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య పొందేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖ అధికారిణి శశికళ మే 14న ఒక ప్రకటనలో సూచించారు.
ఈ ఏడాది పదో తరగతిలో 7 జీపీఏకు మించి మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మే 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి: Free Training for Women: మహిళలకు ఉచిత శిక్షణ.. అర్హులు వీరే!
ఎంసెట్ కోసం..
ఈ ఏడాది పదో తరగతిలో 7 జీపీఏకు మించి మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రత్యేక శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Published date : 15 May 2024 04:12PM