Telangana Vidyarthi Parishad: విద్యార్థులకు వసతులు కల్పించాలి
Sakshi Education
లోకేశ్వరం: ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొట్టూరి ప్రవీణ్‌కుమార్ అన్నారు.
మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను మార్చి 21న సందర్శించారు. విద్యార్థులతో మాట్లా డి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్‌లో రెగ్యులర్ వార్డెన్‌ను నియమించాలన్నారు.
చదవండి: Collector Warning: ఈ పరీక్షలపై.. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని కోరారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. విద్యార్థుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట నిర్మల్ పట్టణ కన్వీనర్ జాదవ్ మిథున్ ఉన్నారు.
Published date : 22 Mar 2024 03:18PM