Change Maker Sia Godica: చేంజ్ మేకర్‌గా గుర్తింపు.. సైన్స్ వీడియోతో బహుమతి..
సాక్షి ఎడ్యుకేషన్: 'బెంగళూరుకు చెందిన సియా గోడికా పేరు వినిపించగానే ‘సోల్ వారియర్స్’ గుర్తుకు వస్తుంది. ‘సోల్ వారియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు పాదరక్షలను అందిస్తుంది సియా. ‘చేంజ్‌మేకర్’గా గుర్తింపు పొందిన సియా గోడికా చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ‘ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’ గురించి ఆమె చేసిన సైన్స్ వీడియో ‘బ్రేక్‌త్రూ జూనియర్ చాలెంజ్’లో బహుమతి గెలుచుకుంది'.
Telangana Vidyarthi Parishad: విద్యార్థులకు వసతులు కల్పించాలి
సైన్స్, మ్యాథమెటిక్స్‌కు సంబంధించి క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఇచ్చే ప్రైజ్ ఇది.
సేవామార్గంలో ప్రయాణించడంతో పాటు క్రియేటివ్ థింకింగ్ కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటుంది సియా. సైన్స్‌కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమే..
‘ఇంట్లో పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు’ అని చెప్పడానికి సియా ఒక ఉదాహరణ. సేవాకార్యక్రమాలకు తమ వంతుగా సహాయపడడం నుంచి సైన్స్ సంగతులు చెప్పడం వరకు సియా గోడికాకు ఎన్నో రకాలుగా ఆమె తల్లిదండ్రులు సహకారం అందించారు.
RMF Rest: అమ్మల ప్రశాంతతకు ఆర్‌ఎమ్‌ఎఫ్.. దీని వినియోగం ఇలా..