Telangana MBBS Seats Increased : తెలంగాణలో మొత్తం 8,915కు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. పూర్తి వివరాలు ఇవే...
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ మెడికల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో కొత్తగా ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే.. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరింది.
అలాగే ఎంబీబీఎస్(MBBS) సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది.
కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు..
తెలంగాణలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 10వ తేదీన మరో 4 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది.గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
#Tags