PM-USHA Scheme: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.10కోట్లు

పాల్వంచ: కేంద్రప్రభుత్వం బాలికల అభివృద్ధికి నిర్దేశించిన ప్రధానమంత్రి రాష్ట్రీయ ఉచ్చేతార్‌ శిక్ష అభియాన్‌ పథకం కింద పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.10కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రిన్సిపాల్‌ వై.చిన్నప్పయ్య తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 13 కళాశాలలు ఎంపిక కాగా, ఇందులో పాల్వంచ కూడా ఉందని వెల్లడించారు. ఈ నిధులతో అత్యాధునిక వసతులతో బాలికల హాస్టల్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కళాశాల 2024–25 విద్యాసంవత్సరం నుండి అటానమస్‌ హోదా కలిగి ఉండడంతో పాటు నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ సాధించిన నేపథ్యాన నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.

#Tags