Online Applications: జూనియర్‌ కళాశాలల పథకానికి దరఖాస్తులు ఆహ్వానం..

జూనియర్‌ కళాశాలల పథకంకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి నేతానియల్‌ తెలిపారు..

కరీంనగర్‌: 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రెప్యుటెడ్‌(కార్పొరేట్‌) జూనియర్‌ కళాశాలల పథకంకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి నేతానియల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెప్యుటెడ్‌ స్కీం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, అంధ విద్యార్థులకు ప్రైవేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించనున్నామన్నారు. కొత్తగా జిల్లాలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

iPhone users: యూజర్లకు యాపిల్‌ అలర్ట్‌

రెసిడెన్షియల్‌ వసతి కలిగి, విద్యాబోధన సాగించే అర్హత గల కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యాజమాన్యాలు ఐదేళ్లకు సంబంధించిన అకాడమిక్‌ ప్రొఫైల్‌తోపాటు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఈ నెల 27లోగా అన్ని వివరాలతో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎంపికైన కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏటా ట్యూషన్‌ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.35 వేలు, పాకెట్‌ మనీ కింద రూ.3 వేలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

AP Inter Colleges Reopen: జూన్‌ 1న కళాశాలలు పునఃప్రారంభం.. వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

#Tags