51 Year Old Woman Passed 10th Class Exams : 51 ఏళ్ల వ‌య‌స్సులో.. 10వ తరగతి పాస్‌.. ఎందుకంటే..?

చ‌ద‌వాల‌నే.. బ‌ల‌మైన సంక‌ల్పం ఉండాలే.. కానీ వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని నిరూపించారు.. త‌మిళ‌నాడులోని కరూర్‌ జిల్లా కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల‌ రహీలా భాను. ఈ 51 ఏళ్ల మహిళ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.
Tamil Nadu 51 Year Old Woman Passed Her 10th Class Exams

ఈమె పూవంబాడి పంచాయతీ యూనియన్‌ మిడిల్‌ స్కూల్‌లో వంటపని చేస్తోంది. 1989లో 9వ తరగతి పూర్తి చేసిన ఈమె కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్లలేదు.

☛ Inspiring Women Success Story : కూలీ భారతి కాదు.. డాక్టర్‌ భారతి అనాల్సిందే.. ఈ స‌క్సెస్‌ జ‌ర్నీ ఎందరికో స్ఫూర్తి..

ఈ క్రమంలో 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే న్యూట్రిషన్‌ ఆర్గనైజర్‌ పోస్టుకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున 10వ తరగతి పరీక్షలు హాజరు కావాలని నిర్ణయించుకుంది. గత ఏప్రిల్‌లో జరిగిన 10వ తరగతి సాధారణ పరీక్షలకు ప్రత్యేక అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంది.

☛ Inspiring Success Story : నాడు న‌న్ను చూసి వెక్కిరించిన‌ వాళ్లే.. నేడు న‌న్ను చూసి ఆశ్చర్యపోతున్నారు.. నా స‌క్సెస్ ఫార్ములా ఇదే..

ఈమె ఇంగ్లీషు, సోషల్‌సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆపై తాను ఉత్తీర్ణత సాధించని తమిళం, గణితం, సైన్స్‌ సబ్జెక్టులకు జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసి పరీక్ష రాసింది. ఈ క్రమంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇటీవ‌లే విడుదలయ్యాయి. ఇందులో రహీలా భాను తమిళం, గణితం, సైన్స్‌ సబ్టెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు.

చ‌ద‌వండి: ఆరేళ్ల క‌ష్టానికి ఫ‌లితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే...

#Tags