Skip to main content

Women Success as Entrepreneur: యువ‌తి పారిశ్రామిక‌వేత్త‌గా పొందిన పుర‌స్కారం

పొందిన విద్య‌కు త‌గ్గ ఉద్యోగం సంపాదించాల‌న్న ఆలోచ‌న కాకుండా త‌న చ‌దువు, విద్యావిధానం మ‌రికొంద‌రికి ఉప‌యోగ‌ప‌డేలా, యువ‌త‌కు ఉపాధి క‌ల్పించే మార్గాన్ని ఎంచుకుంది ఈ యువ‌తి. అలాంటి వ్యక్తిత్వంతో ఈ స్థాయికి చేరింది అరుషి అగర్వాల్. ఇంతకీ అరుషి అగర్వాల్ ఎవరు? ఈ యువ‌తి సాధించిన ఆ అద్భుతం ఏమిటనే పూర్తి విష‌యాల్ని ఈ కథనంలో తెలుసుకుందాం....
Aarushi Agarwal awarded by the government as Entrepreneur
Aarushi Agarwal awarded by the government as Entrepreneur

విద్య‌తో ఉపాధి అవ‌కాశం, కానీ: నిజానికి అరుషి అగర్వాల్ స్వస్థలం మొరాదాబాద్. ఈమె జెపి ఇన్స్టిట్యూట్ నుంచి బి-టెక్ అండ్ ఎమ్-టెక్ పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే రెండు సార్లు కోటి రూపాయల భారీ జీతం ఆఫర్ పొందింది. అయితే ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించింది.

స్వ‌యంకృషితో పారిశ్రామిక‌వేత్త‌గా: ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్‌ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి, యువ పారిశ్రామిక వేత్తగా.. కేవలం మూడు సంవత్సరాల్లో రూ. 50 కోట్ల కంపెనీ నిర్మించేలా చేసింది. భారీ వేత‌నాన్ని వీడి, తానే సొంతంగా కంపెనీ ప్రారంభించాలన్న‌ సంక‌ల్పంతో కోడింగ్ నేర్చుకొని ఈ TalentDecrypt అనే సంస్థను ప్రారంభించింది. దీనితో పాటుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందని యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధిలోకి తెచ్చింది. ఈ క్ర‌మంలో అనుకున్న విధంగా రూ. లక్ష పెట్టుబడితో కంపెనీ మొదలుపెట్టింది.

Inspirational Success Story : ఆ స్వేచ్చతోనే.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్న‌త ఉద్యోగాలు కొట్టారు.. ఒక‌రు డీఎస్సీ.. మ‌రోక‌రు మేజ‌ర్‌..

పొందిన విజ‌యం: కంపెనీ ప్రారంభించిన కేవలం మూడు సంవత్సరాల్లో ఆమె సాఫ్ట్‌వేర్ సహాయంతో 10 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. అంతే కాదు, వారు త‌మ కంప‌నీకే కాకుండా యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, సింగపూర్, యుఎఇ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్‌లోని 380 కంపెనీలకు సహాయం చేశారు.

women entrepreneur

సాఫ్ట‌వేర్ ఉద్యోగానికి: ఈ సాఫ్ట్‌వేర్ కింద, ఉద్యోగం పొందాలనుకునే వారు హ్యాకథాన్ (Hackathon) ద్వారా వర్చువల్ స్కిల్ టెస్ట్ చేస్తారు. దీని తరువాత నేరుగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి మోసాలకు తావు లేకుండా ఉద్యోగం పొందటానికి వీలు కల్పిస్తుంది.

Women's Success Story: ఐఆర్ఎస్ అధికారిణి.... ఎంతోమందికి స్పూర్తిగా ఈ మ‌హిళ‌

యువ‌తి పారిశ్రామిక‌వేత్త‌గా: అరుషి అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా భారత ప్రభుత్వంచే పురస్కారం పొందింది. ఆమె తన తాతగారు 'ఓం ప్రకాష్ గుప్తా'ను తన ఆరాధ్యదైవంగా భావిస్తుందని తెలిపింది. ఆమె తండ్రి అజయ్ గుప్తా వ్యాపారవేత్త, ఆమె తల్లి గృహిణి. ప్రస్తుతం ఆమె నోయిడా కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
 

Published date : 20 Sep 2023 11:24AM

Photo Stories