331 Jobs: వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలోని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ (ఏపీవీవీపీ) పరిధిలో 14 స్పెషాలిటీల్లో 331 వైద్య పోస్టుల భర్తీకి వచ్చే నెల ఐదోతేదీ నుంచి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ జూన్‌ 28న తెలిపారు.
331 వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరైన వారికి కాంట్రాక్ట్‌ పద్ధతి నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నాటికి 70 ఏళ్లు పైబడని రిటైర్డ్‌ వైద్యులు అర్హులని తెలిపారు. 5వ తేదీ జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ స్పెషాలిటీల్లో, 7వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, 10వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి స్పెషాలిటీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తా­మని వివరించారు. షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు గొల్లపూడిలోని ఏపీవీవీపీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకుని దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నోటిఫికేషన్‌ వివరాల కోసం అభ్యర్థులు  hmfw.ap.gov.inలో చూడాలని సూచించారు.

చదవండి: Medical Services Recruitment Board: వైద్య పోస్టుల భర్తీకి బోర్డు

ఇతర వివరాలకు 06301138782 ఫోన్‌ నంబరులోగానీ, apvvpwalkinrecruitment@gmail.com లోగానీ సంప్రదించాలని కోరారు. కాంట్రాక్ట్‌ పద్ధతి నియామకాల్లో గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూడాలనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 48 వేలకుపైగా పోస్టులను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఏపీవీవీపీ పరిధిలోని గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే పలుమార్లు వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరోసారి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

చదవండి: TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కార‌ణం ఇదే

#Tags