Medical Services Recruitment Board: వైద్య పోస్టుల భర్తీకి బోర్డు
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పటి పోస్టులు అప్పుడు భర్తీ చేస్తున్నారు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంఎస్‌ఆర్‌బీ)ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, మరో మెంబర్‌గా జాయింట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. ఈ బోర్డు కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్‌ఎస్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేస్తారు.
చదవండి: TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కారణం ఇదే
పదోన్నతుల ద్వారా డిప్యూటి సివిల్ సర్జన్, సివిల్ సర్జన్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియను సంబంధిత విభాగాధిపతుల కార్యాలయాల ద్వారానే చేపడుతున్నారు. ఇకపై ఈ నియామకాలను బోర్డు చేపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రస్తుతం వెబ్‌సైట్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో బోర్డు కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని మెంబర్ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: High Court: ఆ ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టుల భర్తీ
ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా మానవ వనరులను సమకూర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు 49 వేల వరకు పోస్టులను భర్తీ చేసింది. అంతేకాకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులను ఇచ్చింది. వైద్య శాఖలో 4 వారాలకు మించి ఏ పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: National Medical Commission: చేరిన వైద్య కళాశాలలోనే చదువు పూర్తి.. ఇకపై ఇంటర్న్‌షిప్ ఇలా..