Job Fair: 3న మెగా జాబ్‌మేళా

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యాన ఫిబ్రవరి 3వ తేదీన ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ తెలిపారు.

 ఈ మేరకు కలెక్టరేట్‌లో జ‌నవ‌రి 30న‌ జాబ్‌మేళా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే జాబ్‌మేళాలో 65కి పైగా కంపెనీల బాధ్యులు పాల్గొంటారని తెలిపారు. సుమారు 5వేలకు పైగా నియామకాలు జరగన్నందున 18నుండి 35ఏళ్ల వయస్సు కలిగి, పదో తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..

ఆసక్తి, అర్హత ఉన్నవారు http://forms.hele/aWH1uo5 poS6 RrT3 D6 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో పాటు వివరాలకు 88867 11991, 96423 33668 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈకార్యక్రమంలో డీవైఎస్‌ఓ తుంబూరు సునీల్‌రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరాం, ఏపీఆర్వో వల్లోజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

#Tags