Mega Job Mela: మెగా జాబ్‌మేళాలో 675 మందికి ఉద్యోగాలు
మెట్‌పల్లి: మెగా జాబ్ మేళాలో 675మందికి ఉద్యోగాలు దక్కాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలిపారు.
పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్‌లో మార్చి 11న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఇందులో 50 కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 1400మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన 675 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామకపత్రాలు అందించారు.
చదవండి: 1, 325 Singareni Jobs: సింగరేణిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహ పడవద్దని, త్వరలో మరిన్ని జాబ్‌మేళాలు ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాణవేని సుజాత, పలువురు నాయకులు పాల్గొన్నారు.
చదవండి: Teacher Jobs: టెట్ నిర్వహించి టీచర్ పోస్టులు పెంచాలి
#Tags