Job Mela: కర్నూలులో ఉద్యోగమేళా

కర్నూలు సిటీ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీన కర్నూలులోని సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కాలేజీలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు.

ఈ మేళాకు సంబంధించిన కరపత్రాలను జ‌నవ‌రి 28న‌ కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల నైపుణ్యాలను పెంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.

చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..

ఏపీ స్కీల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జిల్లా అధికారి వి.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ 18 నుంచి 35 ఏళ్ల వయస్సులోపు నిరుద్యోగులు మేళాకు హాజరు కావచ్చొని తెలిపారు. పూర్తి వివరాలకు 8374231357, 8309283980, 6300009183 నంబర్లలో సంప్రదించాలన్నారు.

#Tags