వ్యవసాయ విద్యా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్‌ 3న జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్ రెడ్డి డిసెంబర్‌ 2న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వ్యవసాయ విద్యా దినోత్సవం

ఈ సందర్భంగా హైస్కూలు, కళాశాల విద్యార్థులను యూనివర్సిటీకి పిలిపించి వ్యవసాయ క్షేత్రాలను చూపించి ప్రత్యక్ష అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు ఐదు వేలమంది విద్యార్థులు హాజరవుతారని, వారందరికీ పంటల సాగు పద్ధతి, డ్రోన్లు తదితర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. 

ఇదీ నేపథ్యం..

1946 సెపె్టంబర్‌ 2వ తేదీన ఏర్పడిన జవహర్‌లాల్‌ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆహార, వ్యవసాయ శాఖకు మంత్రిగా సేవలందించారు. 1947లో స్వాతంత్య్రాన్ని ప్రకటించిన తర్వాత రాజేంద్రప్రసాద్‌ వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా అత్యున్నత రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. బెంగాల్‌ కరువు అనంతర పరిస్థితుల నేపథ్యంలో.. ప్రత్యేకించి రెండో ప్రపంచ యుద్ధ వాతావరణంలో మనం బియ్యం దిగుమతి చేసుకునే బర్మా దేశం జపాన్‌ ఆ«దీనంలోకి వెళ్లింది. బెంగాల్‌ నుంచి బ్రిటన్ సైనిక దళాలకు బియ్యాన్ని ఎగుమతి చేయలేని స్థితి ఏర్పడింది. బర్మా నుంచి దిగుమతి చేసుకునే 14% బియ్యాన్ని ఎలా భర్తీ చేయాలో తెలియని స్థితిలో ‘గ్రో మోర్‌ ఫుడ్‌’’ అనే నినాదంతో మన దేశ రైతుల్లో, సాధారణ ప్రజానీకంలో స్ఫూర్తిని నింపారు. అందుకు గుర్తుగా డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పేరిట డిసెంబర్‌ 3, 2021న జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2015 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

చదవండి: 

PM Modi: వ్యవసాయ చట్టాలపై సంచలన నిర్ణయం

AIC Recruitment: అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాలో క్లస్టర్డ్‌ హెడ్‌ పోస్టులు

రైతులకు గుడ్‌న్యూస్ : గ్యారంటీ లేకుండానే రూ.3 లక్షల రుణం..దరఖాస్తు చేసుకోండిలా..

#Tags