Skip to main content

PM Modi: వ్యవసాయ చట్టాలపై సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది.
PM Modi
PM Modi

ఈ మేరకు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు న‌వంబ‌ర్ 19వ తేదీన ప్రకటించారు. ఈ న‌వంబ‌ర్ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ..  దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  ‘రైతులు ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదురెట్టు పెంచాం.తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం’ అని మోదీ తెలిపారు.

HImachal Pradesh: భారత ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సదస్సు ఏ నగరంలో ప్రారంభమైంది?

New Protocol: ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

Published date : 19 Nov 2021 12:12PM

Photo Stories