HImachal Pradesh: భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు ఏ నగరంలో ప్రారంభమైంది?
పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్లు) సదస్సు(82వ సదస్సు) నవంబర్ 17న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు జరగనుంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. పార్లమెంట్ సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, దేశ అభివృద్ధి పరుగులు పెట్టడానికి ఇదే తారక మంత్రమని మోదీ ఉద్బోధించారు.
నావికా దళంలోకి విశాఖపట్నం నౌక..
హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును కట్టడి చేసేందుకు ‘విశాఖపట్నం’యుద్ధనౌక (గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్), కల్వరీ రకం జలాంతర్గామి ‘వేలా’ను భారత నావికా దళం తీసుకోనుంది. విశాఖపట్నం నౌకను 2021, నవంబర్ 21న, వేలా సబ్‌మెరైన్‌ను 2021, నవంబర్ 25న నేవీలోకి స్వాగతం పలుకుతామని వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సతీశ్ నాందేవ్ గోర్మడే తెలిపారు.
చదవండి: లఖిమ్‌పూర్ ఘటనపై ఎవరి నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేయనుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్లు) సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
ఎందుకు : చట్టసభలకు సంబంధించిన విషయాలను గురించి చర్చలు జరిపేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్