Tamil Nadu 12th Results Released: తమిళనాడు ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో టాపర్‌గా ఆటో డ్రైవర్‌ కూతురు

తమిళనాడు  ఇంటర్మీడియట్  బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్‌ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది.  

ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్.  తల్లి డొమెస్టిక్‌ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్‌ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లిదండ్రులు.

 

Anand Mahindra Extends Help To Viral Delhi Boy: నాన్న చనిపోయాడు, అమ్మ వదిలేసింది.. సొంతంగా ఫుడ్‌ బిజినెస్.. సెన్సేషన్‌గా మారిన పదేళ్ల పిల్లాడు‌

 

అటు ఇది తమ టీచర్ల  ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్‌ఎం కూడా  ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు.  స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

ఇక తాను చదువులో రాణించడానికి తన కుటుంబం, సోదరి, కాలేజీ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ సహకరించారంటూ పూంగోధయ్‌ తెలిపింది. భవిష్యత్తులో  బికామ్, సీఏ చదివి తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే తన కల అని పేర్కొంది. 

 

 

#Tags