Education: బాలికా విద్యకు తోడ్పాటు

నారాయణపేట: బాల్య వివాహాలను అరికట్టి చదువుకొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
బాలికా విద్యకు తోడ్పాటు

 ఆగ‌స్టు 16న‌ కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఐసీడీఎస్‌, డీడబ్ల్యూఓ, సఖి కేంద్రాల నిర్వాహణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బాలికా విద్యకు తోడ్పాటునందించి ప్రోత్సహించాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, పొలం పనుల్లో బాల కార్మికులు ఉంటే గుర్తించి గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

చదవండి: Yoga Competitions: విద్యార్థి దశ నుంచి యోగా చేయాలి

ప్రణాళిక ప్రకారం రోజూ గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. సఖి కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో 106 మందిని గుర్తించి వారిలో 18 మందిని పాఠశాలల్లో చేర్పించామని అధికారులు వివరించారు. సమావేశంలో ఐసీడీఎస్‌ డీడబ్ల్యూఓ వేణుగోపాల్‌, సిబ్బంది తిరుపతయ్య, కవిత, కరిష్మా, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: BC Residential School: విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం

#Tags