BC Residential School: విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం
Sakshi Education
నల్లగొండ టౌన్: విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరమని, ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో రాణించగలుగుతారని జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు.
గురువారం నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించిన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ అన్నిమళ్ల కొండల్‌రావు మాట్లాడుతూ ఈ మాత్రలను భోజనం తిన్న తర్వాత వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ జమీర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్లప్ప పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
Also read: APOSS: టెన్త్, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే
Published date : 04 Aug 2023 05:46PM