గురుకులాల సంఖ్యను కుదించే ప్రయత్నం: వినోద్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి గురుకుల విద్యా సంస్థల సంఖ్యను కుదించే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ప్రభు త్వం ఏర్పాటుచేసిన 1,023 గురుకులాల సంఖ్యను 119కి కుదించేలా ఉన్నా రన్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుతమున్న గురుకు లాలను విలీనం చేస్తూ ప్రతీ నియోజకవర్గంలో 2,500 మంది విద్యార్థులతో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.

చదవండి: ISO Certificate : బాలిక‌ల గురుకులానికి ఐఎస్ఓ గుర్తింపు!

రాష్ట్ర ప్రభుత్వం కొత్త గురుకులాలు ఏర్పాటు చేస్తోందా లేక పాత వాటిని విలీనం చేస్తోందా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

#Tags