ISO Certificate : బాలికల గురుకులానికి ఐఎస్ఓ గుర్తింపు!
Sakshi Education
శింగనమల: నార్పలలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు దక్కింది. సోమవారం కలెక్టర్ వినోద్‌కుమార్ చేతుల మీదుగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సంగీతకుమారి ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) సర్టిఫికెట్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... దేశంలోనే మొదటిసారి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ అందుకున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన, పాఠశాల నిర్వహణకు సరైన గుర్తింపు దక్కిందన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 15 Oct 2024 01:02PM
Tags
- girls gurukul school
- ISO Certificate
- students education
- Mahatma Jyotiba Phule Girls Gurukula School
- collector vinod kumar
- International Standard Organization
- government gurukul school recognition
- School Management
- education teaching for students
- teaching quality at gurukul schools
- Education News
- Sakshi Education News