Free Coaching: గొర్రెల పెంపకంపై నేటి నుంచి శిక్షణ
అక్టోబర్ 14 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఆసక్తి కలిగిన యువకులు దరఖాస్తు సమర్పించి హాజరుకావొచ్చన్నారు. 10 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో.. లాభసాటి గొర్రెల పెంపకం, దాణా తయారీ, వ్యాధులు – నివారణ పద్ధతులు, టీకాలు వేయించాల్సిన అవసరం, షెడ్ల నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.
చదవండి: DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
18 – 45 ఏళ్ల వయసున్న వారు అర్హులని, శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన యువకులు ఆరు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్సులతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కల్లూరు తహసీల్దారు కార్యాలయం పక్కన కెనరా బ్యాంకు హౌసింగ్ బోర్డు బ్రాంచీ పైన (మూడవ అంతస్తు) సంప్రదించవచ్చని, లేదా 90007 10508 నంబరుకు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- RuralTraining
- KurnoolAgriculture
- YouthEmpowerment
- NandyalaDistrict
- FreeTraining
- ScientificFarming
- Sheep Farming
- K Pushpak
- Free Food
- Hostel Accommodation
- rural youth
- Canara Bank Rural Self Employment Training Institute
- Scientific Methods
- Sheep Farming Training Program Conducted for 10 Days
- Kurnool District News
- andhra pradesh news