Skip to main content

AP IIIT Counselling Dates 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల కౌన్సెలింగ్ 2024-25 తేదీలు ఇవే.. మొత్తం ఉన్న సీట్లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 ప్ర‌వేశాల‌కు కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
Six-Year Integrated Course Entrance Exam Results  RGUKT Triple IT Admissions  2024-25 RGUKT Counseling Dates List of Qualified Students for RGUKT Admissions  AP IIIT Counselling 2024 Dates  RGUKT 2024-25 Counseling Schedule  Qualified Students List  Campus Counseling

ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను అధికారులు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఏపీ ట్రిపుల్ ఐటీలలో 2024–25 ప్ర‌వేశాల‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదే...
➤☛ నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి కౌన్సిలింగ్‌ను జూలై 22, 23వ తేదీలలో నిర్వహించనున్నారు.
➤☛ ఒంగోలు ట్రిపుల్ ఐటికి కౌన్సిలింగ్‌ను జూలై 24, 25వ తేదీలలో నిర్వహించనున్నారు.
➤☛ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్‌ను జూలై 26 27వ తేదీలలో  నిర్వహించనున్నారు.

మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌.. 
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటారు. మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌  నుంచి విద్యార్థులు కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. హాస్టల్ వసతి ఉంటుంది.

➤☛ Benefits of Taking BiPC course in Inter : ఇంట‌ర్‌లో బైపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! బైపీసీతో... క్రేజీ కోర్సులివే..!

ఈ ఏపీ ట్రిపుల్ ఐటీలల్లో కౌన్సిలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ట్రిపుల్ ఐటీల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఒక్కొ ట్రిపుల్ ఐటీకి 1,000 సీట్లు చొప్పున..
ఈ ఏడాది ఏకంగా 53,863 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈ నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కొ ట్రిపుల్ ఐటీకి 1,000 సీట్లు చొప్పున మొత్తం నాలుగు వేలు సీట్లు ఉన్నాయి. ఈడ‌బ్ల్యూఎస్ కోటా కింద మ‌రో 400 సీట్లు ఉన్నాయి. మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ సీట్ల‌కు 53,863 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు దాదాపు 13 మంది పోటీ ప‌డుతున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారిలో ప్ర‌భుత్వ స్కూల్స్ నుంచి 34,154 మంది, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 19,671 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 23,006 మంది బాలురు కాగా, 30,857 మంది బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులు 50,132 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, తెలంగాణ విద్యార్థులు 3,693 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ను మిన‌హాయించి ఇత‌ర రాష్ట్రాల విద్యార్థులు 38 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

➤☛ Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప‌ద్ధ‌తిలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ సీట్ల‌ను ఏపీ, తెలంగాణ విద్యార్థుల‌కు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ఇందులో ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనున‌క‌బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు 100 సీట్లు కేటాయిస్తారు. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు 25 శాతం సూప‌ర్ న్యూమ‌రీ సీట్లు అందుబాటులో ఉంటాయి.

➤☛ New Courses in IITs: మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు ఇవే..

Published date : 19 Jul 2024 09:02AM

Photo Stories