Admissions: పింగిళి కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్)లో 2023–2024 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రమౌళి నవంబర్ 22న ఒక ప్రకటనలో తెలిపారు.
సీపీ గేట్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ఇప్పటికే ప్రవేశాలు జరగా యని పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లలో ఈనెల 24న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను సీపీ గేట్ కన్వీనర్ అనుమతితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: NAAC: డిగ్రీ కళాశాలను సందర్శించిన నాక్ బృందం
సీపీ గేట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించని వారు డిగ్రీ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు కలిగి ఉండి అడ్మిషన్లు పొందవచ్చ న్నారు. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, ఎంకామ్, ఎమ్మెస్సీ బాట నీ, జువాలజీ, మైక్రోబయాలజీలో అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 24న నేరుగా కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరై అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు.
#Tags