NAAC: డిగ్రీ కళాశాలను సందర్శించిన నాక్ బృందం
అద్దంకి: కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలను రెండు రోజులపాటు నాక్ బృందం సందర్శించి వివిధ విషయాలపై అధ్యయనం చేసినట్లు ప్రిన్సిపాల్ వి.మోహనరావు (నవంబర్ 20) సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ కళాశాలలో అందుతున్న సదుపాయాలు, బోధనా పద్ధతులు, అవలంభిస్తున్న విధానాలను పరిశీలించింది. అదే విధంగా విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయోనని అధ్యయనం చేసింది. నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడ్‌ను కేటాయించేందుకు నివేదికను సీల్డ్ కవర్లో బెంగళూరులోని నాక్ ప్రాంతీయ కార్యాలయానికి పంపారని ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రొఫెసర్ వసంత్ హేలవి రెడ్డి, డాక్డర్ హోమీబాబా స్టేట్ యూనివర్సిటీ ముంబయి, ప్రొఫెసర్ ఫకీర్ మోహన్ మెంబర్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ అనీల్‌కుమార్ మహాపాత్ర బాలాసోర్ యూనివర్సిటీ, సిల్చార్ ఉమెన్స్ కళాశాల అసోంకు చెందిన మనోజ్‌కుమార్‌పాల్ ఆ బృందంలో ఉన్నట్లు తెలిపారు. వారికి ప్రిన్సిపాల్ మోహనరావు గత ఐదేళ్లలో నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కళాశాల నాణ్యతా ప్రమాణాల గురించి వివరించారు. డాక్టర్ హేలవి రెడ్డి మాట్లాడుతూ కళాశాల మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చదవండి: Law Course Admissions: లా కోర్సుల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్ కౌన్సెలింగ్