KNRUHS: ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: 2023 ఫిబ్రవరిలో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం (పార్ట్–2) ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న ప్రకటించింది.
మొత్తం 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపింది. మొత్తం 3,046 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి మల్లేశ్వర్ తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడొచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి:
DME: వైద్య విద్యావిభాగంలో 8 కొత్త కొలువులు
Telangana Jobs: మహబూబ్‌నగర్ జిల్లా ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్ట్ పోస్టులు
#Tags