CIPET: సీపెట్‌ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

గన్నవరం రూరల్‌: సీపెట్‌ (సెంట్రల్‌ ఇని స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) డి ప్లొమా కోర్సులలో ప్రవేశాలకు జూలై 28వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సీపెట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌ సీహెచ్‌ శేఖర్‌ తెలి పారు.
సీపెట్‌ డిప్లొమా కోర్సుల దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

జూలై 17న‌ ఆయన మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరానికి జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా, రెండేళ్ల వ్యవధి గల పోష్ట్ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులకు  దరఖాస్తులు చేసుకోవాలన్నారు. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ(డీపీటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ) కోర్సులకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ కోర్సులకు బీఎస్సీ విద్యార్హత ఉండాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ సదుపాయం అందిస్తుందని, పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చునని,  జి.మల్లేశ్వరరావు  9440531978 నంబర్లో సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

చదవండి:

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ... తర్వాత జాబ్ కూడా... ఎక్కడంటే?

CIPET Recruitment 2023: సీపెట్, మైసూరులో వివిధ ఉద్యోగాలు

#Tags