ISRO: అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతున్న ‘ఆజాదీ శాట్‌’

75 పాఠశాలలకు చెందిన 750 మంది బాలికలతో రూపకల్పన
ISRO lines up Azadisat, 75 student satellites for launch this year

బాలికలు తయారు చేసిన ‘ఆజా దీ శాట్‌’ను అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైసూ్కల్స్‌కు చెందిన 750 మంది బాలికలు తయారుచేసిన ఆజాదీ శాట్‌ను ఆగష్టు 15లోపు స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. 

also read: Graduation ceremony:ప్రధాని నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకున్న సెయింట్‌ జోసెఫ్‌ విద్యార్థులు

బరువు 8 కేజీలు.. 75 పే లోడ్స్‌ 
బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్‌ బరువు 8 కేజీ లు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఈ ఉపగ్రహంలో ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్‌ కౌంటర్లు, సోలార్‌ ప్యానల్‌ సహాయంతో ఫొటో లు డానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం ఆరు నెలలు మాత్రమే అంతరిక్షంలో సేవలంది స్తుంది. ఈ ఏడాది ‘అంతరిక్షంలో అతివ’(ఉమెన్‌ ఇన్‌ స్పేస్‌)గా గుర్తించిన నేపథ్యంలో ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌ మ్యాథమేటిక్స్‌’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. రిఫాత్‌ షరూక్‌ అనే మహిళ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు.  

also read: Quiz of The Day (August 01, 2022): హైదరాబాద్ నగరం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?

కశీ్మర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. 
కశీ్మర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న జడ్పీ పా ఠశాలల్లో 75 పాఠశాలల నుంచి గ్రామీణ ప్రాంతాలకు చెందిన 750 మంది విద్యారి్థనులు ఈ ఉపగ్రహం తయారీలో పాలుపంచుకోవడం దీని ప్రత్యేకత. గ్రామీణ విద్యార్థులను శాస్త్ర, సాకేంతిక రంగాలవైపు మళ్లించేందుకు ఇదో చిన్న ప్రయ త్నంగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

also read: Moutaineering : 13 ఏళ్లకే కార్తికేయ రికార్డు

#Tags