Vidyadan Scholarship Program: సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ కోసం దరఖాస్తులు.. అర్హులు వీరే!
రాయవరం: కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 6,500 మందికి పైగా ఆర్థిక సహాయం, 27,600 మంది వరకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఎంపికైన విద్యార్థులు రెండేళ్ల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్‌షిప్ పొందవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదవడానికి స్కాలర్‌షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకూ ఉపకార వేతనం అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్‌కు అవసరమైన దిశానిర్దేశం చేస్తారు.
NFSU Notification 2024: ఈ కోర్సులతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు
విద్యార్థుల అర్హతలు
సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం పొందాలంటే ఆ విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియెట్ చదువుతున్న వారు అర్హులు. పదిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు రావాలి.
ఎంపిక విధానం
చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 23న దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. ఎంపికై న విద్యార్థులు జూన్ 20 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Jyothi Yarraji: స్వర్ణ పతకంతో కొత్త సీజన్‌ను ప్రారంభించిన జ్యోతి యర్రాజీ!
జూన్ 7వ తేదీ వరకూ గడువు
విద్యాదాన్ ఉపకార వేతనం కోసం జూన్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, చదువుతున్న కళాశాల వివరాలను పొందుపర్చాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ మెయిల్ కలిగి ఉండాలి. నెట్ సెంటర్, ఇతరుల ఈ మెయిల్ ఐడీలను అనుమతించరు. భవిష్యత్తులో ఎస్‌డీఎఫ్ నుంచి ఎటువంటి సమాచారమైనా ఈ మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అందుకే సొంత ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకుని, దాని పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యాదాన్.ఆంధ్రఃఎస్‌డీ ఫౌండేషన్‌ఇండియా.కామ్ సంప్రదించాలి. లేదా 96635 17131 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Female Cricket: టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
దరఖాస్తు చేసుకునే విధానం
విద్యార్థులు ప్లేస్టోర్‌లోని విద్యాదాన్ యాప్, లేదా విద్యాదాన్ వెబ్‌సైట్ www.vidyadan.orgలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల జాబితాల ప్రకారం మీ పేరులో మొదటి పేరును ఎంటర్ చేయాలి. తర్వాత రెండో పేరును నమోదు చేయాలి. అనంతరం విద్యార్థి సొంత చిరునామాను నమోదు చేయాలి. అనంతరం అప్లయ్ నౌ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఈ మెయిల్‌కు మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం లింక్ వస్తుంది. యాక్టివేషన్ లింక్ క్లిక్ చేయగానే విద్యాదాన్ హోమ్ పేజీలో అకౌంట్ యాక్టికేటెడ్ అనే మెసేజ్ కనిపిస్తుంది.
Dental Corps Post: ఇండియన్ ఆర్మీలో 30 డెంటల్ కార్ప్స్ పోస్టులు
ఈ మెయిల్ ఐడీ, విద్యాదాన్ పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయితే స్టెప్–2లోకి వెళతారు. లాగిన్ అయిన తర్వాత హెల్ప్‌పై క్లిక్ చేసి, సూచనలు చదివి, దాని ప్రకారం అప్లికేషన్ పూర్తి చేసి, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఎడిట్‌పై క్లిక్ చేస్తే అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. సబ్మిషన్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తుంది. డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోను అప్‌లోడ్ చేసిన తర్వాతే దరఖాస్తును అంగీకరిస్తారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు ఈ మెయిల్‌ను చెక్ చేసుకోవాలి. ఎస్‌డీఎఫ్ ప్రతి సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తుంది.
Tags
- vidyadan scholarship
- sarojini damodar foundation vidyadan
- online applications
- students eligibiles
- admissions
- students talent
- education for students
- stipend
- Graduates
- students education
- Education News
- Sakshi Education News
- Dr. B. R. Ambedkar District News
- AP News
- central government scholarship for students
- Economically Backward Students
- Academic excellence
- government schemes
- Implementation States
- scholorships