Book Reading: విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌కు బానిసలు కాకూడదు..
Sakshi Education
ఇప్పటి పిల్లలంతా సమయం దొరికితే చాలు, ఫోన్లకు బానిసలు అవుతున్నారు. అయితే, వారికి ఈ ఇతర విషయాలను తెలియజేయాలి. బయట ఆడుకోవడం లేదా పుస్తకం చదివించడం వంటివి..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు కథల పుస్తకాలు చదువుతూ సంస్కృతి, సభ్యత అలవర్చుకోవాలని పుస్తక పఠనంతో వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలని సుగుణ సాహితీ సమితి కన్వీనర్ బైతి దుర్గయ్య అన్నారు. స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్‌లకు బానిసలు కాకూడదన్నారు. మంగళవారం సిద్దిపేట శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో డాక్టర్ సిరి రాసిన సిల్వర్ ఫీతర్ కథల పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోతుకు నరేష్‌కుమార్, బాలసాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
NEET Exam Controversy: మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాలంటూ డిమాండ్!
Published date : 14 May 2024 04:15PM