Free Coaching: యూత్‌ ఫర్‌ జాబ్స్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉట్నూర్‌ రూరల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వైకల్యం కలిగిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు యూత్‌ ఫర్‌ జాబ్స్‌ ఆధ్వర్యంలో రిటైల్‌, హాస్పిటాలిటి, బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సుల్లో 2 నెలల పాటు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆగ‌స్టు 28న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇందుకు దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌ 40 నుంచి 100 శాతం వైకల్యం, 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

ఆసక్తి గల నిరుద్యోగులు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 30 సాయంత్రం 6 గంటలలోగా ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9010295910 నంబరులో సంప్రదించాలని సూచించారు.

చదవండి:

Skill Courses : పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ఈ స్కిల్ కోర్సుల‌పై ఉచిత శిక్ష‌ణ‌..

Skill Training For Youth: యువతకు ఫ్లిప్‌కార్ట్‌ నైపుణ్య శిక్షణ

#Tags