UGC: దూర విద్య మరింత భద్రం
యూజీసీ అనుమతి ఉన్న విద్యా సంస్థల వివరాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందాలనుకునే వారు ఈ వెబ్‌సైట్‌ను పరిశీ లించాలని కోరింది. ఎలాంటి అనుమతిలేని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు చేసిన విద్యా ర్థులు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారని, ఇక మీదట ఈ పరిస్థితి తలెత్తకుండా చేయ డమే దీని ఉద్దేశమని తెలిపింది.
చదవండి: UGC New Rules : ఓపెన్, దూర విద్య చదివే వారికి యూజీసీ కొత్త రూల్స్ ఇవే..
మరింత పార దర్శకంగా ఉండేందుకు చేపట్టిన ఈ మార్పు లు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వెబ్ పోర్టల్‌తో పాటు విద్యార్థులకు ఉపయుక్తంగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌ను అందు బాటులోకి తెచ్చామని తెలిపింది.
విద్యార్థి చేసే కోర్సుకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ ఏడాది అకడమిక్ సెషన్ సెప్టెంబర్ నుంచి మొదల వుతుందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ వెల్లడించారు.