Skip to main content

Students Schemes : పెండింగ్‌లో విద్యా, వ‌స‌తి దీవెన‌.. ఏఐఎస్ఎఫ్ నాయ‌కుల విన‌తి ప‌త్రం

Pending of students schemes leads to aisf leaders petition at collectorate

నరసరావుపేట: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ జూనియర్‌, డిగ్రీ, బీటెక్‌, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రావాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Bus Facility for Students : ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులకు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం

వీటిని చెల్లించకపోవటంతో విద్యార్థులను ఆయా యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా పరీక్షలు రాయనీయట్లేదన్నారు. దీని వలన హాస్టళ్లలో ఉన్న పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్దంగా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని కోరారు. నాయకులు ఎం.మధు, హేమంత్‌, యాసిన్‌, సాయి శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Oct 2024 05:32PM

Photo Stories