UPSC Ranker Success Stroy : ఇంట్లోనే ఉంటూ చ‌దివి.. సివిల్స్ కొట్టానిలా.. నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC) నిర్వ‌హించే సివిల్స్‌ సాధించాలనే తపనతోపాటు ప్రణాళికతో చదివితే విజయం సాధించడం సులభమని నిరూపించాడు నల్లగొండకు చెందిన‌ దామోర హిమవంశీ.

సివిల్స్‌-2022 ఫలితాల్లో సత్తాచాటి జిల్లా కీర్తిని పెంచారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన సులభంగా చేరుకోవచ్చని నిరూపించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో హిమవంశీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :

నల్లగొండ జిల్లా కేంద్ర వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ దామెర యాదయ్య- నిర్మల కుమారుడు హిమవంశీ.

☛ Inspiration Story: భ‌ర్త కానిస్టేబుల్‌.. భార్య‌ ఐపీఎస్‌.. 10వ తరగతి కూడా చదవని భార్య‌ను..

ఎడ్యుకేష‌న్ :
హిమవంశీ.. స్కూల్‌ విద్యాభ్యాసం నల్లగొండలోని సెయింట్‌ ఆల్ఫాన్సెస్‌ హైస్కూల్‌లో 1 వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. హైదరాబాద్‌లో నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసి జేఈఈలో ఉత్తమ పర్సంటైల్‌తో సత్తా చాటాడు. 2013లో ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఐఐటీలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ జియోఫిజికల్‌ టెక్నాలజీలో సీటు సాధించాడు.తండ్రి డాక్టర్‌ కావడంతో తాను సివిల్స్‌ వైపు వెళ్తే బాగుంటుందని బాల్యంలో నిర్ణయించుకున్న కలను నెరవేర్చుకునేందుకు ఐఐటీ రూర్కీ వేదికైంది. 

ఇంట్లోనే ఉంటూ సొంతగా..
సీనియర్స్‌ సివిల్స్‌కు సిద్ధమవుతుండటంతో తాను సైతం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ చదువుతూ పూర్తికాగానే తొలి పర్యాయం 2019లో సివిల్స్‌ రాసి విఫలమయ్యాడు. వెనుకంజ వేయకుండా ఇంట్లోనే ఉంటూ సొంత నోట్స్‌ తయారుచేసుకుంటూ చదివి నాలుగో పర్యాయం 2022లో సివిల్స్‌ రాసి 548వ ర్యాంక్‌తో విజయం సాధించాడు.

☛ Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

చిన్నప్పుడే నువ్వు కలెక్టర్‌ అయితే..
నాన్న పిల్లల వైద్యులు. అమ్మ నిర్మల గృహిణి. నాన్న డాక్టర్‌ కావడంతో చిన్నప్పుడే నువ్వు కలెక్టర్‌ అయితే బాగుంటుందని చెప్పారు. ఇంట్లో అప్పుడప్పుడు అమ్మానాన్నలు గుర్తు చేస్తూనే ఉండేవారు. అలా నాలో సంకల్పం బలమైన బీజంగా నాటుకుంది. ఇంటర్మీడియెట్‌ తర్వాత ఐఐటీ రూర్కీలో చేరాగానే సీనియర్స్‌ సివిల్స్‌ చదువడం చూశా. ఇక్కడే మరింత చదువాలని నిర్ణయించుకొని అమ్మానాన్నకు చెప్పా. వారు నువ్వు బాగా చదువుకోమని చెప్పారు. అదే స్ఫూర్తితో ఓవైపు ఇంజినీరింగ్‌ చదవుతోపాటు మరో వైపు సివిల్స్‌ విజయం సాధించాలంటే ఎలా అనే విషయాలను సీనియర్స్‌ ద్వారా తెలుసుకున్నా. 

2018లో ఇంజినీరింగ్‌ పూర్తికాగానే తొలి పర్యాయం 2019లో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయినప్పటికీ రాలేదు. కానీ, మా అమ్మానాన్న నీలో సత్తా ఉంది చదువాలని ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో నల్లగొండలో ఇంట్లోనే ఉంటూ సొంత నోట్స్‌ తయారుచేసుకుంటూ సిద్ధమై 2020, 2021, 2022లో రాసి దేశంలో 548 ర్యాంక్‌తో విజయం సాధించా. కోచింగ్‌ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందనే ఆలోచన ఉండకూడదు. అదే నేను చేశాను. రోజుకు 8 నుంచి 9గంటలు మాత్రమే చదివేవాడిని. తర్వాత అమ్మానాన్నతో సంతోషంగా గడిపేవాడిని. ఆత్మ విశ్వాసంతో చదివితే సివిల్స్‌లో సత్తా చాటడం సులభం.

☛ IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

నా ల‌క్ష్యం ఇదే..
డాక్టర్‌గా తన తండ్రి యాదయ్య అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని సివిల్‌ సర్వీస్‌ ఎంపికై ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు హిమవంశీ తెలిపారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్‌ ర్యాంకు సాధించానన్నారు. ప్రస్తుతం ఐపీఎస్‌ గానీ, ఐఆర్‌ఎస్‌ వస్తే జాయిన్‌ అయిన తరువాత కూడా ఐఏఎస్‌ సాధించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. నిరుపేదలకు న్యాయం చేయాలంటే సివిల్‌ సర్వీస్‌తోనే సాధ్యమవుతుందన్న ఆలోచనతో తాను అటువైపు దృష్టిపెట్టినట్లు తెలిపారు.

☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

#Tags