UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

యూపీఎస్సీ ఇటీవలే విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో వైఎస్సార్ కడప జిల్లా విద్యార్థి ఉన్న‌త ర్యాంక్ సాధించాడు. క‌డ‌ప న‌గ‌రంలోని విజయదుర్గా కాలనీకి చెందిన మర్రిపాటి నాగభరత్‌ తల్లిదండ్రుల కోరిక మేరకు రూ.15 లక్షల సాఫ్ట్‌వేర్‌ వేతనాన్ని వదులుకుని కలెక్టర్‌ కావడమే లక్ష్యంగా సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యాడు.

ల‌క్ష్య‌సాధ‌న‌లో ముందుకు వెళ్లి యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో జాతీయ స్థాయిలో 580వ ర్యాంక్ సాధించి.. ఐఏపీఎస్‌కు ఎంక‌య్యాడు. ఈ నేప‌థ్యంలో నాగభరత్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం.. 

కుటుంబ నేప‌థ్యం : 
నాగభరత్‌..  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప న‌గ‌రంలోని విజయదుర్గా కాలనీకి చెందిన వారు. మర్రిపాటి నాగరాజు. ఈయ‌న వ్యవసాయశాఖ ఏడీగా ప‌నిచేస్తున్నారు. తల్లి దివంగత సునందల.

ఎడ్యుకేష‌న్ :  
1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కడప నాగార్జున మోడల్‌ స్కూల్‌లో నాగభరత్‌ చదివాడు. ఆ త‌ర్వాత‌ 10వ తరగతి, ఇంటర్‌ కడపలోని నారాయణ ఒలంపియాడ్‌లో పూర్తి చేశాడు. జాతీయ స్థాయిలో జేఈఈలో 396వ ర్యాంకు సాధించాడు. కలకత్తా ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ ఈసీ పూర్తి చేశాడు.  అలాగే అక్క‌డే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. 

☛ UPSC Civils 1st Ranker Aditya Srivastava Story : సివిల్స్‌లో నా నెం-1కి ప్లాన్ ఇదే.. శ్రీవాత్సవ నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన మంచి విష‌యాలు ఇవే..

రూ.15 లక్షల వేతనంతో..
నాగభరత్ ఎంటెక్ పూర్తి చేసిన త‌ర్వాత‌.. రూ.15 లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే తన తల్లిదండ్రుల కోరిక మేరకు లక్షలాది రూపాయల వేతనాన్ని వదిలేసి ఢిల్లీలోని వాజీరావు కోచింగ్‌ సెంటర్‌లో ఏడాది పాటు ఐఏఎస్‌కు కోచింగ్‌ తీసుకున్నాడు. తరువాత హైదరాబాద్‌కు వచ్చి బాలలత మేడ‌మ్‌ గైడెన్స్‌తో సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. ఇంతటితో నిరాశ చెందకుండా వారి మార్గదర్శకత్వంలోనే మళ్లీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకుంట ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 580వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకుతో ఐపీఎస్‌ రావచ్చని అయితే తన లక్ష్యం ఐఏఎస్‌ అని చెబుతున్నాడు. అల‌గే నా మార్గదర్శకులు.. అమ్మానాన్నలే.

☛ Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

తల్లి కోరిక ఇదే..

తన చిన్నతనంలో తమ తండ్రి కలెక్టర్‌ అంటే ఏమిటి..? ఆయన విధులు ఎలా ఉంటాయి..? ఆయన అనుకుంటే పేదలకు ఏం చేయవచ్చు..? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు..? అనే విషయాలను తనకు తెలిపేవాడు. తమ తల్లి కోరిక కూడా తాను కలెక్టర్‌ కావడమే.. తమ తండ్రి స్ఫూర్తి, తల్లి కోరిక మేరకు చిన్నప్పటి నుంచే కలెక్టర్‌ కావడమే లక్ష్యంగా ముందుకు సాగాను. అయితే ఎంటెక్‌ తరువాత పలుమార్లు సివిల్స్‌కు సిద్ధమ‌ య్యాను. 2022లో మాత్రం ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఆగిపోయాను. అయితే అంతటితో నిరాశ చెందకుండా తల్లిదండ్రుల స్ఫూర్తితో మళ్లీ శ్రమించి ఇటీవల విడుదలైన సివిల్స్‌లో 580వ ర్యాంకు సాధించాను. ఈసారి సివిల్స్‌లో కచ్చితంగా మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్‌ కావడమే తన ముందున్న లక్ష్యం అని మర్రిపాటి నాగభరత్‌ తెలిపారు.  

☛ UPSC Civils 2nd Ranker Animesh Pradhan Story : చిన్న వ‌య‌స్సులోనే నాన్న మృతి.. మ‌రో వైపు సివిల్స్ ఇంట‌ర్వ్యూ టైమ్‌లోనే అమ్మ మ‌ర‌ణం.. ఆ బాధతోనే..

వీరి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తా..
పేదరిక నిర్మూలన లక్ష్యంగా... తాను ఐఏఎస్‌కు ఎంపికై పేదరిక నిర్మూలనకు కృషి చేయడంతోపాటు విద్య, ఆరోగ్యం, స్కిల్స్‌ అభివృద్ధిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. తమ తండ్రి వ్యవసాయశాఖలో ఏడీగా పనిచేస్తున్నారు. రైతుల కష్టాల గురించి పలుమార్లు తెలిపేవారు. వారి కష్టాలు తీర్చేందుకు  కృషి చేస్తాన‌ని నాగభరత్‌ తెలిపారు.

#Tags