Krishna Bhaskar, IAS : లక్షల జీతం కాద‌ని.. ల‌క్ష్యం కోసం..

ఆయన ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి బీటెక్ ఎలక్ట్రానిక్స్ పట్టా అందుకున్నారు. తర్వాత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.
దేవరకొండ కృష్ణభాస్కర్, కలెక్టర్

బహుళజాతి కంపెనీలో ఉద్యోగం పొందేందుకు అన్ని అర్హతలు సాధించారు. వెంటనే మోటరోలా కంపెనీ డిజైన్ ఇంజినీర్‌గా నియమించుకుంది. అంతపెద్ద కంపెనీల్లో లక్షల్లో వేతనంపై పనిచేస్తున్నా.. ఆయన మాత్రం అక్కడ ఎంతోకాలం నిలువలేకపోయారు.

తొలిప్రయత్నంలోనే..
తన లక్ష్యమైన ఐఏఎస్ సాధన వైపు అడుగులు కదిపారు. తొలిప్రయత్నంలో ఐఏఎస్‌కు అడుగు దూరంలో ఆగిపోయారు. ఐపీఎస్‌కు ఎంపికై ఓవైపు శిక్షణ పొందుతూనే.. మరో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. సివిల్స్ సాధించాలనే నేటి యువతకు రోల్‌మోడల్‌గా నిలిచారు. ఆయనే జగిత్యాల సబ్ కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్.

అమ్మానాన్నలిద్దరూ..
తల్లిదండ్రులే పిల్లలకు తొలిగురువులు, మార్గదర్శకులు అంటారు. కృష్ణభాస్కర్ విషయంలో ఆ మాట నిజమైంది. అమ్మానాన్నలిద్దరూ ఐఏఎస్ అధికారులే. చిన్నతనం నుంచి వారిని గమనిస్తూ పెరగడం వల్లే తాను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకున్నారు కృష్ణభాస్కర్. ఉన్నత విద్యనభ్యసించి, పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం సివిల్ సర్వెంట్‌గా మారాను అంటారాయన.

ఎన్నో అవకాశాలున్నా...


కెరీర్లో ఎన్నో అవకాశాలున్నా... అమ్మానాన్న స్ఫూర్తితో ప్రజాసేవకు ఐఏఎస్సే సరైన దారని భావించానని చెబుతారు. కృష్ణభాస్కర్ తండ్రి దేవరకొండ భాస్కర్ రిటైర్డ్ ఐఏఎస్ కాగా, తల్లి లక్ష్మీపార్థధి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో డెరైక్టర్ ఆఫ్ జనరల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు పార్థసారధి భాస్కర్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ విభాగానికి ఎంపికై ప్రస్తుతం కస్టమ్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

పుట్టి పెరిగింది అంతా ఇక్క‌డే..


కృష్ణభాస్కర్‌ది స్వతహాగా కేరళ రాష్ట్రం అయినా... అమ్మానాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు కావడంతో పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదువుకున్నారు.ఖరగ్‌పూర్ ఐఐటీలో 2005లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి 2009లో ఎంబీఏ పట్టా పొందారు. అనంతరం మొటరోలా కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన తల్లిదండ్రుల బాటలోనే నడవాలని సివిల్స్‌పై దృష్టి సారించారు.

ఎస్పీగా ఉన్న స‌మ‌యంలో...
2011లో సివిల్స్ రాయగా మొదటి ప్రయత్నంలోనే 90వ ర్యాంకుతో ఐపీఎస్ వచ్చింది. సర్దార్ వల్లాభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌లో ట్రెయినింగ్ పొందిన అనంతరం ట్రెయినీ ఎస్పీగా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. కానీ, ఆయన దృష్టంతా సివిల్స్‌లో టాప్ అయిన ఐఏఎస్‌పైనే ఉండేది. ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే 2012లో మరోసారి సివిల్స్ రాశారు. ఈసారి 9వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

నా తొలి పోస్టింగ్ ఇక్క‌డే..
ముస్సోరీలో శిక్షణ అనంతరం విశాఖపట్టణంలో శిక్షణ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ విభజనలలో భాగంగా కృష్ణభాస్కర్‌ను తెలంగాణకు కేటాయించగా తొలి పోస్టింగ్ జగిత్యాల సబ్ కలెక్టర్‌గా లభించింది.

ఇందుకే ఐఏఎస్‌ను ఎంచుకున్నా...
పేదల కోసం ప్రభుత్వం ఏమేం పథకాలు ప్రవేశపెడుతుందో చాలా మందికి తెలియడం లేదు. ఈ పథకాలు వారికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తా. నేను ఎన్నో రకాల కెరీర్‌లు పరిశీలించినా సేవ చేయడమే లక్ష్యంగా ఐఏఎస్‌ను ఎంచుకున్నా. అవినీతిని అంతం చేసేలా పారదర్శక పాలన అందిస్తా.

ఒకే సారి ఇంత మందిని...


రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్న స‌మ‌యంలో విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులపై కొరడా ఝుళిపించారు. ఒకే సారి జిల్లాలోని ముగ్గురు ఎంపీడీవోలతో సహా 52 మంది ప్రత్యేక అధికారులు, 52 మంది పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే..


ట్వీటర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఫాలోవర్స్‌ కలిగిన కలెక్టర్‌గా దేవరకొండ కృష్ణభాస్కర్‌ రికార్డు సాధించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ట్విటర్‌లో collrajannasircilla@collector_rsl ఖాతా తెరిచారు. ప్రజలు కూడా తమ సమస్యలను కలెక్టర్‌ ట్విటర్‌కు పోస్టు చేశారు.స్థానిక పాతబస్టాండ్‌లో అపరిశుభ్రతపై ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు తొలుత కలెక్టర్‌ స్పందించి అధికారులతో తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తర్వాత పలు ట్వీట్‌లతో ప్రజలకు చేరువయ్యారు. ఆయన ట్వీటర్‌లో 2,000 మందికి పైగా ఫాలోయర్స్‌ ఉండటం రాష్ట్రస్థాయిలో రికార్డు నెలకొల్పింది.

స్వయంగా కలెక్టరే రంగంలోకి దిగి..


కోవిడ్ కేసులు ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌భుత్వ లాక్‌డౌన్‌ను విధించింది. ఇలాంటి ఏవి పట్టించుకోని జనం విచ్చలవిడిగా రోడ్ల మీదకు వ‌స్తున్నారు.ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న ప్రజలను నిలవరించేందుకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసులు, ఇతర అధికారులతో రోడ్లపై తిరుగుతూ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అడ్డుకుని జరిమానా విధించారు.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

D.Roopa, IPS: ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఐపీఎస్‌..ఎక్క‌డైన స‌రే త‌గ్గ‌దేలే..

#Tags