UPSC Civil Services Cut Off Marks 2023 : యూపీఎస్సీ సివిల్స్ 2023 కటాఫ్ మార్కులు విడుదల.. టాప్ ర్యాంక‌ర్ల‌కు ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 కటాఫ్ మార్కులను విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్‌ నోటిఫికేషన్ ప్రకారం జనరల్ కేటగిరికి -953, EWS కేటగిరి -923, OBC-919, SC -890, ST-891, PwBD-1 కేటగిరీకి 894, PwBD-2 కేటగిరీకి 930, PwBD-3కేటగిరీకి 756, PwBD-5 కేటగిరీకి 589.

సివిల్స్ ప్రిలిమ్స్ లో ఈసారి జనగర్ కేటగిరి కటాఫ్ మార్కులు 75.41, 2022లో 88.22, 2021లో 87.54 కంటే తక్కువ. EWS కేటగిరికి 68.02, OBC కేటగిరికి 74.75, SC -59.25, ST -47.82, PwBD-1 కేటగిరి 40.40, PwBD-2 కేటగిరి 47.13, PwBD-3 కేటగిరికి 40.40, PwBD-5 కేటగిరికి 33.68.

☛ UPSC Results 2023: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌–25 ర్యాంకర్లలో ఉన్న‌ మహిళలు వీరే!!

UPSC మెయిన్స్ లో ఈ ఏడాది కటాఫ్ మార్కులు : 
జనరల్ కేటగిరీ కటాఫ్ -741, 2022లో 748, 2021లో 745 కంటే తక్కువ. EWS కేటగిరీకి కటాఫ్ 706, OBC -712), SC 694, ST -692, PwBD -1 కేటగిరి -673, PwBD-2 కేటగిరి718, PwBD-3 కేటగిరి -396, PwBD-5 కేటగిరి 445.

యూపీఎస్సీ సివిల్స్ 2023 టాప్‌ ర్యాంక‌ర్లుకు వ‌చ్చిన మార్కులు ఇవే..
యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫ‌లితాల్లో మొదటి ర్యాంకర్‌ ఆదిత్య శ్రీవాస్తవకు మొత్తం 2025 మార్కులకు గాను 1099 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్‌ అనిమేష్‌ ప్రధాన్‌కు 1067 మార్కులు, మూడో ర్యాంకర్‌ మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డికి 1065 మార్కులు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల‌ నుంచి ఈ సారి రికార్డు స్థాయిలో
రెండు తెలుగు రాష్ట్రాల‌ నుంచి ఈ సారి రికార్డు స్థాయిలో సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మంది దివ్యాంగులు ఉండడం విశేషం.

#Tags