Success Story : ఇంటర్‌లో పెళ్లి.. సెలవుల్లో కూలీ .. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు

అందరితో ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం బందీ అయ్యింది. పాఠశాలకు వెళ్లాలంటే సెలవుల్లో పనికి పోవాల్సిందే. బీదరికంతో అష్టకష్టాలు అనుభవించిన ఆయన ఏనాడు తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు.
N Balaram IRS Officer

ఉన్నత చదువులు చదివి సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటేనే గుర్తింపు, గౌరవం దక్కుతుందని భావించి.. తన లక్ష్యాన్ని సివిల్స్‌ వైపు మళ్లించిన ఐఆర్‌ఎస్‌ అధికారి ఎన్‌ బలరాం సక్సెస్‌ స్టోరీ ఇదీ... 

IPS Success Story : న‌న్ను విమర్శించిన‌ వారే.. ఇప్పుడు త‌ల‌దించుకునేలా చేశానిలా..

ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే సివిల్స్‌ ర్యాంకు
సివిల్స్‌లో ర్యాంకు సాధించడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు. ఎంతో సాధన ఉంటే కానీ, ర్యాంక్‌ సాధించలేము. అలాంటిది బాల్యం నుంచే చదువుకోవడానికి ఇబ్బంది పడిన వ్యక్తి ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే సివిల్స్‌ సాధించడం లక్షలాది నిరుద్యోగ అభ్యర్థులకు స్ఫూర్తిదాయకమే కదా. సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరాం విజయ గాథ ఇదీ..   


పనికి వెళ్తే రూ.25 వచ్చేది... 

మాది మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలానగర్‌లోని తిరుమలగిరి. తల్లిదండ్రులు హూన్య, కేస్లీ... ఏడుగురు సంతానం. అందులో పెద్దవాడ్ని. మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. కానీ నీటి కొరత. అందుకే అమ్మానాన్న హైదరాబాద్‌ లో కూలీ పనిచేసేవాళ్లు. దాంతో నానమ్మ దగ్గర పెరిగా. ప్రభుత్వ బడిలోనే చదువుకున్నా. ఎప్పుడూ చదువులో ముందుండేవాడ్ని. కుటుంబ ఆర్థిక పరిస్థితులు నాపై బాగా ప్రభావం చూపాయి. అందుకే ఏమాత్రం సెలవు దొరికినా కూలీ పనికెళ్లేవాడ్ని. అప్పట్లో రోజంతా కష్టపడితే ఇరవై ఐదు రూపాయలు వచ్చేవి. దాంతోనే నా అవసరాలు తీర్చుకునేవాడ్ని. వేసవి సెలవుల్లో తోటి స్నేహితులు కాలక్షేపం చేస్తే, నాకు కూలీ పనులతోనే రోజు గడిచేది.

IAS Officer Success Story : నాన్న నిర్ల‌క్ష్యం.. అన్న త్యాగం.. ఇవే న‌న్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌.. కానీ

ఇంటర్‌లోనే పెళ్లి... 
ఇంటర్‌లో ఉండగానే శారదతో వివాహమైంది. అటు కుటుంబం, ఇటు సంసార బాధ్యతలతో ఉన్నత చదువులు భారమయ్యాయి. హైదరాబాద్‌ ఓయూ యూనివర్సిటీ చూశాక చదువుపై మరింత ఆసక్తి పెరిగింది. దూరవిద్యలో డిగ్రీ, పీజీ పూర్తి చేశా. సివిల్స్‌ సాధించాలనే పట్టుదల పెరిగింది. అద్దెకట్టలేని స్థితిలో స్నేహితుల గదుల్లో ఉండి చదువుకున్నా. యూజీసీ నెట్‌ క్వాలిఫై అయ్యా. ఆ తర్వాత గ్రూప్‌ 1, 2 అర్హత సాధించా. సీబీఐ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పనిచేశా. అయినా సివిల్స్‌ లక్ష్యంగా కష్టపడ్డా . 2010 సివిల్స్‌కు ఎంపికయ్యా. ఢిల్లీలో శిక్షణ పూర్తి అయిన తర్వాత మేడ్చల్‌ లో సెంట్రల్‌ కస్టమ్స్‌ డివిజన్‌ అధికారిగా విధులు నిర్వహించా.

Success Story : నలుగురు తోబుట్టువుల్లో.. ముగ్గురు ఐఏఎస్‌లు.. ఒక ఐపీఎస్‌.. వీరి స‌క్సెస్ సీక్రెట్ మాత్రం ఇదే..

చెల్లించని పన్నులపై దృష్టి పెట్టా... 

కొన్నాళ్లు ముంబై డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశా. పెద్ద పెద్ద కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేవి. అందులో పదిహేను వందల వరకు కంపెనీలు ఉన్నాయి. వాటన్నింటికి నోటీసులు పంపి సుమారు రూ.150 కోట్లు వసూలు చేశా. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కంటైనర్లపై కేసులు పెట్టా. విధి నిర్వహణలో రాజీపడని తత్వం నాది. ఈ మధ్యనే సింగరేణి కాలరీస్‌ కంపెనీకి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా బాధ్యతలు చేపట్టా. కంపెనీ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నా. సింగరేణిలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నా.

Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేర‌య్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..

#Tags